భజ్జీకి మళ్లీ పిలుపు

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండేళ్ల తర్వాత భారత జాతీయ జట్టులో మళ్లీ చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు. అయితే ఒక్క మ్యాచ్ ఆడేందుకు అతడికి బీసీసీఐ అవకాశం కల్పించింది. ఐపీఎల్-8లో ఆడుతున్న భజ్జీ ఇప్పటివరకు 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో టీమిండియాకు విరాట్ కోహ్లిని కెప్టెన్ గా నియమించారు. టెస్టులకు ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లికి పగ్గాలు అప్పగించారు. వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా కొనసాగనున్నాడు. టెస్టు జట్టులో వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సాహాకు అవకాశం దక్కింది.

టెస్టు టీమ్
కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, ధావన్, రహానే, పూజారా, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, అశ్విన్, ఆరోన్, కెఎల్ రాహుల్, కరణ్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్)

వన్డే టీమ్
ధోని(కెప్టెన్), సురేశ్ రైనా, ధావన్, రోహిత్ శర్మ విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్, మొహిత్ శర్మ, దవళ్ కులకర్ణి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top