నా గెలుపుపై నమ్మకం ఉంది

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం అజహర్ తన నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అజహరుద్దీన్.. తన గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోవు హెచ్సీ ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. లోధా సిఫారుల మేరకే తాను నామినేషన్ వేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్సీఏ అనేది నగరాలకే పరిమితమైందన్న అజహర్.. తన గెలుపు కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు కోరనున్నట్లు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top