ఏకపక్షంగా చిన్నజట్ల సమరం

హోరాహోరీగా సాగుతుందనుకున్న చిన్న జట్ల పోరు ఏకపక్షంగా సాగింది. భారీ స్కోరును క్రికెట్ బేబీ బంగ్లాదేశ్ ఏమాత్రం తడబాటు లేకుండా ఛేదించింది. నలుగురు బ్యాట్స్ మెన్ అర్థసెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ మరో 11 బంతులు మిగులుండానే విజయాన్ని అందుకుంది. తమీమ్ ఇక్బాల్(95), మహ్మదుల్లా(62) నిలకడగా ఆడగా... ముష్ఫికర్ రహీం(60), షకీబ్(52) వేగంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

భారీ స్కోరును కాపాడుకోవడంలో సాట్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. బంగ్లా బ్యాట్స్ మెన్ జోరును అడ్డుకోలేపోయారు. బౌలింగ్ తేలిపోయిన సాట్కాండ్ బ్యాటింగ్ లో ఆకట్టుకుంది. ముఖ్యమంగా కోయెట్జర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులు వరుసగా పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం బ్యాట్ దించలేదు. ఈ క్రమంలో కెరీర్ లో బెస్ట్ స్కోరు(156) నమోదు చేశాడు. అతడు మరికాసేపు క్రీజ్ లో ఉండివుంటే స్కాట్లాండ్ స్కోరు 350 పరుగులు మించేదనడంలో సందేహం లేదు.

కోయెట్జర్ అవుటైన తర్వాత స్కాట్లాండ్ వెన్వెంటనే వికెట్లు కోల్పోయి 318 పరుగుల స్కోరు వద్ద ఆగింది. స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన కోయెట్జర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top