‘హోదా’కు అడ్డు..బాబు అవినీతే
‘‘ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు... ఎన్నికలు ముగిశాక ప్లేటు ఫిరాయిస్తూ ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదని నీరుగార్చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడేసరికి ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదనే ఆలోచనకు బీజేపీ నేతలు వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాకులు వెదకడానికి ప్రధాన కారణం చంద్రబాబు వైఖరే. చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేను రూ.20 కోట్లకు కొనుగోలు చేస్తూ వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన తరువాత వారానికే ప్రత్యేక హోదాపై మాట మార్చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు