సీఎన్ఎన్పై ట్రంప్ పిడిగుద్దులు!
ప్రఖ్యాత అమెరికా న్యూస్ చానెల్ సీఎన్ఎన్పై తాను దాడి చేస్తున్నట్టు చూపించే ఎడిట్ చేసిన వీడియోను ట్విటర్లో పెట్టడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో చేస్తున్న యుద్ధం ముదిరి పాకానపడుతోంది. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి అన్ని రకాల వార్తా ప్రసార సాధనాలతో పేచీలు పెట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాపై పోరు సాగిస్తున్నానని కూడా ప్రకటించుకున్నారు. తాను పాల్గొన్న ఓ కుస్తీ పోటీ తాలూకూ వీడియోతో తాజాగా సీఎన్ఎన్పై తన అక్కసును తీర్చుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు