ప్రింట్ కొడితే ఇల్లొచ్చేస్తుంది!
‘‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు’’ అని సామెత. పెళ్లిమాటేమోగానీ... ఈ రోజుల్లో కూడా ఇల్లు కట్టడమంటే అంత తేలికైన పనేమీ కాదు. కాంట్రాక్టర్లకు పని అప్పగించినా సరే.. ఒక ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు పడుతుంది. కానీ... పక్క ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇంటిని కేవలం 24 గంటల్లో కట్టేశారు! థ్యాంక్స్ టు ఆపిస్ కోర్ త్రీడీ ప్రింటర్! అవునండీ.. ఇది మనిషి అవసరం ఏమాత్రం లేకుండా కేవలం ఒక ప్రింటర్ సాయంతో కట్టేసిన ఇల్లు. ఇప్పటివరకూ చాలా చోట్ల ఇలా త్రీడీ ప్రింటర్లతో ఇళ్లు కట్టేసేందుకు ప్రయత్నాలు జరిగాయిగానీ... అవన్నీ కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి. అచ్చంగా అలాంటి ఇంట్లో నివాసం ఉండేందుకు మాత్రం వీలు కాలేదు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు