పన్నీరు సీటుకు ఎసరు పెట్టిన శశికళ
చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనన్న నినాదం అన్నాడీఎంకేలో మిన్నంటుతోంది. నేతలందరూ తమ ఓటు చిన్నమ్మకే అంటూ నినాదించే పనిలో పడ్డారు. తంబిదురై ప్రకటనతో నేతలు ఒకే వేదికగా చేరి ముక్తకంఠంతో సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనని చిన్నమ్మ మీద ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్లు సమాలోచనలో పడ్డారు. చినమ్మ ఆండిపట్టి నుంచి బరిలో దిగుతారా లేదా నన్నిలం నియోజకవర్గామా అన్న చర్చ అన్నాడీఎంకేలో ఊపందుకుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపట్టగానే, సీఎం పగ్గాలూ చేపట్టాలన్న నినాదం తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఆరుగురు మంత్రులు చిన్నమ్మే మా సీఎం అని గళాన్ని విప్పారో లేదో, సోమవారం నాటికి ఆ నినాదం అన్నాడీఎంకేలో మిన్నంటుతోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు