‘కేసీఆర్‌ తుగ్లక్‌లా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నీ తుగ్లక్‌ పనులు చేసి చాలా గొప్పగా చేశానంటూ చెప్పుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌తో రాజకీయ ప్రసంగం చదివించారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియా వద్ద టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top