అమెరికాలో దారుణం.. మరో భారతీయుడిపై కాల్పులు
అమెరికాలో భారతీయులపై వరుసగా జాతి విద్వేషపు దాడులు జరుగుతున్నాయి. శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్ దారుణహత్యల విషాదం నుంచి కోలుకోకముందే గుర్తు తెలియని దుండగుడు మరో భారతీయుడిపై కాల్పులు జరిపాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్టంలోని కెంట్ నగరంలో శ్వేతిజాతి దుండగుడు.. మీ దేశానికి వెళ్లిపో అంటూ సిక్కు వ్యక్తి (39)పై ఆయన ఇంటి బయటే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సిక్కు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని కెంట్ పోలీస్ చీఫ్ కెన్ థామస్ చెప్పారు. కాగా బాధితుడి పేరు తెలియరాలేదు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు