విద్యార్థినులను బంధించి పూజలు

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినులను వారి తరగతి గదిలోనే బంధించి పూజలు చేసింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై కూడా ఆమె చిర్రుబుర్రులాడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి హల్‌చల్ చేసిన సదరు మహిళను మందలించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top