రేవంత్ రెడ్డి విడుదల రేపు
కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. జైలు నుంచి విడుదల అయ్యేందుకు మాత్రం మరో రోజు వేచి ఉండక తప్పడం లేదు. కోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. దర్యాప్తు అధికారుల ముందు పూచీకత్తులు, సాక్షులను ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు ఏసీబీ మెమో దాఖలు చేయనుంది. ఏసీబీ మెమో ఆధారంగానే ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు