'హోదా కోసం కలసి పని చేయడానికి సిద్ధం'

ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలను చాలామంది ఎత్తి చూపించినా, మీరు వినకూడదనకుంటే ఏం చేస్తామని, అందుకే రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని అన్నారు. కనీసం తప్పు చేశాం.. మంచి చేద్దామనుకున్నాం కానీ పరిమితుల వల్ల చేయలేకపోయామని చెప్పకపోతే ఎలాగని ప్రశ్నించారు. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు, నాటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ బయటకు వచ్చి, మీకు ఇష్టం లేని హిందీని మీ మీద రుద్దం అని ప్రకటించి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అలాంటిది మీరు పార్లమెంటులో మాటిచ్చి.. ఇప్పుడు మాత్రం ఇవ్వం, అనుకున్నాం, కుదరదు అని మొండిగా మాట్లాడితే కుదరదని స్పష్టం చేశారు. వాళ్ల పక్కన తిరిగినప్పుడు ఏమీ అనకుండా ఇప్పుడు ట్విట్టర్‌లో మాట్లాడుతున్నానంటే ఎలాగని అన్నారు. తాను కనీసం ట్విట్టర్‌లో అయినా మాట్లాడుతున్నానని, మన ఎంపీలు పార్లమెంటులో ఉన్నా ప్రత్యేక హోదా మీద ఏమీ మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు చెప్పారని, బలంగా వాదించారని, దానికి మించింది లేదని కొన్ని సంవత్సరాలు వాదించడం వల్లే ప్రజలు దాన్ని అడుగుతున్నారని పవన్ అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఒకలా, తర్వాత మరోలా మాట్లాడితే ప్రజలకు విశ్వాసం పోతుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నా, ప్రజా సమస్యల మీద కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, తనది ప్రజల పక్షం తప్ప మరే పార్టీ పక్షం కాదని పవన్ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top