రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్

సామాన్యుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు పేపర్ బాయ్గా పనిచేశారు. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్ ఆరంభంచి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న స్వీకరించారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిరోహించారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్థానమిది. కోట్లాది మంది స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఇకలేరు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన ఆశయాలు, కలలు ఎప్పటికీ బతికే ఉంటాయి. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలని పిలుపునిచ్చిన ఏకైక దార్శనికుడు అబ్దుల్ కలాం. అలాగే, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్లీ పిల్లలకు అంత చేరువగా వెళ్లిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఆయన స్ఫూర్తితో అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు భారతదేశంలో వచ్చారు. ఇస్రో, డీఆర్డీఓ, షార్ తదితర కేంద్రాల్లో ఇప్పటికీ ఆయన శిష్యులు, ప్రశిష్యులే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రక్షణ రంగంలో పరిశోధనలు చేసిన ఆయన.. కేర్ ఆస్పత్రికి చెందిన సోమరాజుతో కలిసి హృద్రోగులకు అమర్చే స్టెంట్ల రూపకల్పనలో కూడా కీలకపాత్ర పోషించారు. కలాం జీవితంలో కీలక ఘట్టాలు..

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top