నీతి అయోగ్ తొలి భేటీ హైలైట్స్...

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 'నీతిఅయోగ్' కార్యక్రమం జరిగింది. నీతిఅయోగ్ విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపిన కొన్ని హైలైట్స్:
ఈ సమావేశంలో ప్రధాని మానస పుత్రికలైన జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో ఏ విధంగా విజయవంతమందీ వివరించారు. అదేవిధంగా 'స్వచ్ఛభారత్' కార్యక్రమం రాష్ట్రాల సహకారంతో ఏ విధంగా విజయవంతమైందో తెలిపారు. మొదటి సబ్ గ్రూప్..కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించి ఏవి అవసరమో అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. రెండో గ్రూప్...రాష్ట్రాల్లోని స్కిల్ డెవలప్ మెంట్ పథకం కోసం సూచనలు, సలహాలతో నివేదిక సమర్పిస్తుంది. మూడో గ్రూప్...దైనందిన జీవితంలో స్వచ్ఛ భారత్ భాగమయ్యేలా దాని ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించాలి.దీనికి అవసరమయ్యే యంత్రాంగ రూపకల్పనకు సలహాలు, సూచనలతో ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మూడు సబ్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top