అది బాధ కలిగించిన విషయం: పవన్‌ కళ్యాణ్‌

అక్టోబర్‌ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను రూపుమాపే వరకు నిరంతం పోరాటం చేస్తామన్నారు.

ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా మానవతాకోణంలో చూడాలన్నారు. ఉద్దానం సమస్య వ్యక్తిగతంగా తనకు చాలా బాధ కలిగించిన విషయమని పేర్కొన్నారు. ఉద్దానం సమస్య గురించి మాట్లాడినప్పడు పరిష్కారానికి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ముందుకు వచ్చారని, రీసెర్చ్‌ సెంటర్‌ పెడితే కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారని వెల్లడించారు. ఉద్ధానం సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్‌తో ఆపకుండా చాలా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్ధానంలో అనాథలైన పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలని సూచించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top