త్రీడీ హోలోగ్రాం టెక్నాలజీతో నిరసన!

వీరు నిరసనకారులు... ఏదో విషయంపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో పోలీసులు వీరిని అడ్డుకోవడం వంటి చేస్తుంటారు. ఇక్కడ మాత్రం పోలీసులు వీరిని టచ్ కూడా చేయలేరు. ఎందుకో తెలుసా? ఇక్కడ నిజంగా మనుషులుంటేగా!! ఇక్కడున్నవన్నీ వారి ప్రతిరూపాల్లాంటివే... అదే త్రీడీ హోలోగ్రాం టెక్నాలజీ మహిమ. ఒకచోట మనుషులు, వస్తువులు లేకున్నా లేజర్ల సహాయంతో అవక్కడ ఉన్నట్లు కన్పించేలా చేసే ప్రక్రియే త్రీడీ హోలోగ్రాం.

స్పెయిన్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ అక్కడి ప్రభుత్వం 'గ్యాగ్' అనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో అక్కడి నిరసనకారులు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇలా వినూత్న ప్రదర్శన నిర్వహించారు. వెబ్క్యాబ్ ద్వారా వేల మంది నిరసనకారులు వారి హోలోగ్రాంలను పంపించారు. వీరందరి హోలోగ్రాంలతో స్పెయిన్ రాజధాని మడ్రిడ్ లోని పార్లమెంట్ భవనం ఎదుట ఈ ర్యాలీ చేపట్టారు. ఈ తరహాలో నిరసన తెలపడం ప్రపంచంలో ఇదే తొలిసారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top