నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్‌

ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సమ్మేళ నం (సైన్స్ కాంగ్రెస్‌)కు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యం ప్రాంగణంలో జరిగే ఈ 104వ సమ్మేళనాన్ని నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్‌ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్‌ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top