ఏమనుకున్నావ్.. పేగులు తీస్తా: మంత్రి
‘నువ్వు ఎవడ్రా జిల్లా తెమ్మని నన్ను అడగడానికి.... పేగులెల్లుతయ్ బిడ్డ. నేను గట్టిగ తొక్కిన్నంటే’అంటూ మంత్రి చందూలాల్ బూతు పురాణం అందుకున్నారు. ములుగు–సమ్మక్క సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని ఈ మేరకు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నువ్వెం త నీ బతుకెంత అంటూ నోటికొచ్చి నట్లు తిట్టారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. ఈ నెల 26 రాత్రి ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చందూలాల్‌ను సంప్రదించగా... ఇదో వార్తా ? వంద సవాళ్లు వస్తుంటయ్ మాకు. వాడో చిల్లర గాడు, వాడి వాయిస్తోని మీరు ఎందుకు వార్త రాస్తరు, రాత్రి పదిగంటలకు ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తని సమాధానం ఇచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు