5న రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటన

రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ఏపీ సర్కార్ నవంబర్ 5నప్రకటించనుంది. పదో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనుంది. అయితే, రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లబ్దిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ పేరుతో భారీ కోత పెడుతోంది. ఆధార్ కార్డు లేదని 18 లక్షలమంది అకౌంట్లను ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఆధార్ కార్డుల సమర్పణకు శుక్రవారంతో బ్యాంకుల వద్ద గడువు ముగిసింది. దాంతో ఇకనుంచి గడువు పెంచలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రుణమాఫీ లబ్దిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తొలివిడత చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. రుణమాఫీతో 30లక్షల కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది కలుగుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే, మొత్తం రుణాలున్న రైతుల్లో ఐదోవంతు మందికి మాత్రమే తొలి విడతలో రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. దానికితోడు కుటుంబంలో ఒక్కరికే, ఒక్క రుణమే మాఫీ చేస్తామనడంతో డ్వాక్రా రుణాలు, పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయం ఏమవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top