ఖైదీ x శాతకర్ణి (ఎమ్మెల్యే vs ఎంపీ)

ఏడాదికో మారు వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి నందమూరి బాలకృష్ణకు సంకటంగా మారుతోంది. గడిచిన సంక్రాంతికి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల రిలీజ్‌తో థియేటర్ల కొరత నందమూరి వారసుల మధ్య వార్‌కు తెరతీసిన సంగతి తెల్సిందే. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య పోటీ సిద్ధమైంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ జనవరి 11 న, యువరత్న బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడి గా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు సినిమా హాళ్ల సమస్య ఉండ దు. అదే సమయంలో సినీ నిర్మాత అల్లు అర వింద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లు ఉండటంతో ఆయన బావ చిరంజీవి సినిమా విడుదలకు ఇబ్బందిలేదు. అయితే రెండు చిత్రాల టీజర్, ఆడియో, ట్రైలర్, సినిమా విడుదల వరకు చోటు చేసు కుంటున్న వరుస పరిణామాలు మెగా అభి మానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top