‘ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నంబర్‌1’

ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నెం1 అని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత 71 స్వాతం‍త్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలోని రాణిమహల్‌లో కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో ఈ ప్రగతి సాధ్యమైందని పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు కొత్తగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణలో డ్రగ్స్‌ మాఫియాను అంతం చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ సాయంతో పెద్ద ఎత్తున గొర్రెల, చేపల పెంపకం జరుగుతోందని తెలిపారు. చేనేత కార్మికుల కోసం సమ్రగ చేనేత విధానం అమల్లోకి తెచ్చామని సీఎం పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top