దొరికిన దొంగకు హారతులా?: కర్నె
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50లక్షలిస్తూ ఏసీబీకి దొరికిన దొంగకు హారతులు పడతారా అని నిలదీశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. బెయిల్‌పై విడుదలైన రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ నేతలను దూషించడంపై కర్నె మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు