ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?

పదవిలో ఉండగా ఆరు నెలల జైలుశిక్ష పడిన మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎక్కడున్నారన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. కలకత్తా హైకోర్టుకు చెందిన ఈ న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారని కొంతమంది చెబుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం భారతదేశంలోనే ఎవరికీ తెలియని ఓ ప్రదేశంలో ఉన్నారంటున్నారు. ఆయన అరెస్టును తప్పించుకోడానికి ఏమీ ప్రయత్నించడం లేదని, అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం అడుగుతున్నారని ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు. తమిళనాడులోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారని కథనాలు రావడంతో పశ్చిమబెంగాల్ నుంచి పోలీసు బృందం చెన్నైకి వెళ్లినా, అక్కడ ఆయన కనిపించలేదు. తనపై జారీచేసిన అరెస్టు ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని కర్ణన్ సుప్రీంకోర్టును కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top