దేశ ప్రతిష్టను మంటకలిపింది

అమరావతి బ్యూరో పెట్టుబడుల పోటెత్తుతాయంటూ ఒకవైపు ‘భాగస్వామ్య సదస్సు’లో ప్రభుత్వం ఊదరగొడుతోంది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం అంటూ ప్రకటనలు ఒకవైపు గుప్పిస్తుంటే.. ఇంకోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ ‘డిజైన్‌’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్‌ సంస్థ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’ సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్‌ ఆర్కిటెక్చురల్‌ ప్రొఫెషన్‌) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్‌లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top