బాత్‌రూం గోడలో రహస్యంగా నల్లధనం

ఐటీ శాఖ వరుస దాడులతో నల్ల కుబేరుల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. బెడ్‌రూం, బాత్‌రూంలు.. ఎక్కడ నల్లధనం దాచినా గుట్టలు గుట్టలుగా వెలికితీస్తున్నారు. ఇటీవలే భారీగా నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న కర్ణాటక ఐటీ అధికారులు తాజాగా చిత్రదుర్గలోని ఒక ఇంటి బాత్‌రూం గోడ వెనుక రహస్యంగా దాచిన రూ. 6.6 కోట్ల నగదును సీజ్‌ చేశారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ నగరాల్లో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. చిత్రదుర్గ జిల్లా చల్లకెరెలో కన్నడ సినీనటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అలియాస్‌ పప్పి ఇంట్లో సోదాల్లో రూ.5.70 కోట్లు విలువ చేసే కొత్త రూ. రెండు వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top