ఫేస్బుక్ కేక్ థ్రిల్ కావాలా నాయనా?
కొత్త కొత్త ఆవిష్కరణలో యూజర్లకు థ్రిల్ చేస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో కొత్త అంశంతో షాక్ ఇవ్వబోతోంది. సారీ.. కేక్ ఇవ్వ బోతోంది. అవునండీ.. ఇప్పటివరకూ యూజర్లు పోస్ట్ చేసిన ఫోటోలతో చక్కటి వీడియోలను రూపొందించి ఆకట్టుకుంటున్న సంస్థ ఇపుడు వినియోగదారుల పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా వీడియోలను పోస్ట్ చేయనుంది. ఈ రీక్యాప్ వీడియో కోసం ఓ సృజనాత్మక టూల్ ను పరిచయం చేస్తుంది. యూజర్ల బర్తడే సందర్భంతా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఒక వీడియోను గోడపై పోస్ట్ చేయనుంది. అంతేకాదండీ..ఒక పెద్ద కేక్ తో పాటు, సన్నిహితులు, స్నేహితులు పంపిన సందేశాలను కూడా జోడిస్తుంది. దీని కోసం కనీసం మూడు సందేశాలు పోస్ట్ కావాలట. అలాగే ఈ వీడియోను ప్రెండ్స్ తో పంచుకునే ముందు..కావాలంటే ఎడిట్ చేసుకొని, హైలెట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే పుట్టిన రోజు మరుసటి రోజు మనకి ఈ వీడియో కేక్ అందించనుంది ఫేస్ బుక్ .
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు