సినిమా ప్రముఖుల పేర్లు వెల్లడి!

డ్రగ్స్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, కేరక్టర్‌ ఆర్టిసులు చిన్నా, సుబ్బరాజు తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top