షాక్‌: తాగిన మైకంలో పోలీసుల బైక్‌తో..

కర్ణాటకలో ఓ తాగుబోతు పోలీసులకు షాక్‌ ఇచ్చాడు. తాగిన మైకంలో ఉన్న అతడు ఏకంగా ట్రాఫిక్‌ పోలీసు బైక్‌ను కొట్టేశాడు. అంతేకాకుండా ట్రాఫిక్‌ పోలీసు టోపీని దర్జాగా తలపై పెట్టుకొని.. పోలీసుల బైక్‌ మీద జామ్‌జామ్‌ అంటూ దూసుకుపోయాడు. దీంతో బిత్తరపోయిన ఓ ట్రాఫిక్‌ పోలీసు అతడిని దాదాపు ఒక కిలోమీటర్‌ వరకు వెంబడించి మరీ పట్టుకున్నారు. కర్ణాటకలోని హసన్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ తాగుబోతు బిత్తిరి చర్యను తోటి వాహనదారులు మొబైల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top