ఉద్యోగాలు తరలించారో.. ఖబడ్దార్!
అమెరికాలో కంపెనీలు పెట్టి.. ఔట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలను వేరే దేశాలకు ఇస్తే, అలాంటి కంపెనీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒక ఏసీ తయారీ కంపెనీ మెక్సికోకు తరలి వెళ్లిపోవడం కంటే దాని వెయ్యి ఉద్యోగాలను ఇక్కడే ఉంచేలా చేయడంలో తాను విజయవంతం అయినట్లు చెప్పారు. బయటకు వెళ్లిపోయే కంపెనీలు కఠిన చర్యలు ఎదుర్కోవడం ఖాయమని ఆయన అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు