ఇక అమెరికాకు రెండే విధానాలు
అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మైక్ పెన్స్‌తో అమెరికా సుప్రీంకోర్టు జడ్జి క్లారెన్ థామస్ ప్రమాణం చేయించగా, అనంతరం డొనాల్డ్ ట్రంప్‌తో అమెరికా అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. గత నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే స్లోగన్‌తో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు విషయాలను ప్రసంగించారు. ఉగ్రవాదం, వలసలు, అమెరికా సవాళ్లు ఇలా చాలా అంశాలపై ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు