వధువు డ్యాన్స్.. వీడియోలు హల్ చల్!
సాధారణంగా పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుపడతారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియో చూస్తే మాత్రం రిటీన్కు భిన్నమని షాక్ అవుతారు. ఓ పెళ్లివేడుకలో డాన్స్ చేయడానికి తన బంధువులు కాస్త వెనక్కి తగ్గారేమో కానీ, వధువు మాత్రం తానే ముందుగా డ్యాన్స్ స్టార్ట్ చేసి అక్కడున్న వారిలో జోష్ తీసుకొచ్చింది. క్వీన్ మూవీలో కంగనా రనౌత్ డ్యాన్స్ పాటకు స్టెప్పులేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఢిల్లీకి సాగర్ అరోరా అనే వ్యక్తి ఓ వివాహ వేడుకకు సంబంధించిన రెండు వీడియోలు ఐదు రోజుల కిందట తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఓ వీడియోను రికార్డు స్థాయిలో 1.2 కోట్ల మంది వీక్షించగా, మరో వీడియోను 40 లక్షల మంది చూశారు. 1.4 లక్షల మంది వీడియోలను షేర్ చేయగా, 18 వేలకు పైగా నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు