మనం చెప్పినచోటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. రైతులు భూములు అప్పగించేందుకు సంసిద్ధతను వ్యక్తంచేస్తే గుంటూరు జిల్లా మంగళగిరిలో లేదంటే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూజివీడు వద్ద సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చంద్రబాబు మంత్రులకు తెలిపినట్లు సమాచారం.

నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ పి.నారాయణలతో ఈ ఉపసంఘం ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటుకు ఎక్కువ భూమి కావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాజధానికి అవసరమైన భూమిని సేకరించే బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘం తీసుకోవాలని సూచిం చింది. రైతులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించి భూములిచ్చేలా వారిని ఒప్పించాలని చెప్పింది. ఈ మంత్రివర్గ సమావేశం వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. మీడియాకు లీకుల ద్వారా మాత్రమే వివరాలను అందించింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తానని బాబు చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తొలుత మంత్రి అచ్చెన్నాయుడు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top