వేగంగా విస్తరిస్తున్న ‘బీర్ యోగా’
శరీర సౌష్టవానికి, మానిసిక ఉల్లాసానికి యోగా మంచిదన్న విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషయం తెల్సిందే. దక్షిణాసియా దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు యోగా వ్యాపించిన తర్వాత అందుటో పలు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలో హఠ యోగా, అష్టాంగ యోగా, విక్రమ్ యోగా, హాట్ యోగా, అయ్యంగార్ యోగా, విన్యాస యోగా అంటూ పలు రకాల యోగాలకు పాశ్చాత్య దేశాలు తాడుతో యోగా, నీళ్లలో యోగా, డ్యాన్స్ యోగా, కుర్చీ యోగా లాంటి రకాలను మొన్నటి వరకు జోడిస్తూ వచ్చారు. జంతువుల మధ్య యోగా, మేకా, కుక్క, పిల్లీ యోగాలను నిన్నటి వరకు సృష్టించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు