బాబు బంగ్లాల హంగుల వ్యయం రూ.100 కోట్లు

‘‘రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలి’’ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు స్వీకరించిన రోజు ఇచ్చిన పిలుపు ఇదీ. రెండున్నరేళ్ల పరిస్థితిని గమనిస్తే.. చంద్రబాబు తన సూక్తిని తానే పాటించలేదని తేటతెల్లమవుతోంది. ముఖ్యమంత్రి బంగ్లాల్లో సోకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రెండున్నరేళ్లలో సెంచరీ దాటిపోయింది. ఒక్క కొత్త బంగ్లాను కూడా నిర్మించకపోయినా ఉన్న బంగ్లాలకు మరమ్మతులు, హంగుల పేరుతో ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్టేశారు. హైదరాబాద్ సచివాలయంలోని కార్యాలయాల్లో మరమ్మతులు, ఫర్నిచర్ కోసం రూ.45 కోట్లు వెచ్చించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top