ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి

యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి పేరు ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉంది... ఏపీలోని పొట్టి శ్రీరా ములు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మధువర్దన్‌రెడ్డి అదే భూతానికి బలయ్యాడు. పదోతరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన మధువర్దన్‌ను తమ కళాశాలలో చేరమని యాజమాన్యం కోరడంతో అక్కడ తనకు ఏ లోటూ ఉండదని భావించి చేరాడు. నెల రోజులు కూడా తిరక్కుండానే ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు. ఆ విద్యార్థి తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా దొన్నికోటవారిపల్లికి చెందిన కాలువ రాజేశ్వరి, బ్రహ్మానందరెడ్డి దంపతుల రెండో కుమారుడు మధువర్దన్‌రెడ్డి టెన్త్‌లో 10కి 10 పాయింట్లు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరులో కళాశాల యాజమాన్యం... తమ కళాశాలలో ఇంటర్ చేరమని ఫోన్ చేసి కోరడంతో ఆ విద్యార్థి తండ్రి జూన్ 14న మధువర్దన్‌రెడ్డిని అక్కడ చేర్పించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top