చిరు-బాలయ్య సినిమాలకు హై అలర్ట్‌

ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఖైదీ నంబర్‌ 150 సినిమా బుధవారం విడుదల కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం రిలీజ్‌ కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కోడి పందేలపై నెలకొన్న ఉత్కంఠత కంటే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవి నటించిన సినిమాపై ఆయన అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన అభిమానుల్లోనూ అదే స్థాయిలో ఆసక్తి కన్పిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ను జనవరి 14న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top