షాకింగ్ వీడియోను షేర్ చేసిన టాప్ హీరో!
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ సామాజిక విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో పోస్టు చేశారు. ముంబై రైల్వే స్టేషన్లో నడుస్తున్న రైలు నుంచి దిగుతూ ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. రైలు కిందకు వెళ్లిపోతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ చురుగ్గా స్పందించి కాపాడాడు. వెంటనే ఆమెను ఇటువైపు లాక్కొచ్చి ప్రాణాలు నిలబెట్టాడు. ఆ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అక్షయ్‌కుమార్ కొనియాడుతూ ట్వీట్ చేశారు.
'ఈ వీడియో చూసి తన గుండెలు ఆగినంత పనైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోనావాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ పవన్ తాయ్డేకు సెల్యూట్' అంటూ అక్షయ్ పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు