అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్చల్
టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున లీడ్ రోల్ పోషించిన ప్రతిష్టాత్మక ప్రాజక్టు ఓం నమో వెంకేటేశాయ మూవీలో తొలి వీడియో సాంగ్ విడుదలైంది. స్టార్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా’ పూర్తి వీడియో సాంగ్‌ను లహరి మ్యూజిక్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది. దీంతో నాగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శరత్ సంతోష్, శ్రీనిధి ఆలపించిన ఈ సాంగ్ అందరినీ అలరిస్తోంది. అలాగే అన్నమయ్యతో అలరించిన నాగ్.. హథీరాం బాబాగా మరోసారి పౌరాణిక పాత్రలో మరింత ఎలివేట్ అయ్యారన్న కమెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు