సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 3. 'స్పైడర్ బాయ్'

చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. వీటిలో అత్యధిక భాగం చక్కని సందేశాలతో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయాలతో నిండి ఉండడం ఎంతైనా అభినందనీయం. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది.

స్పైడర్ బాయ్
డైరెక్టర్: నిమ్మకాయల రాంజీ.
వయసు: 9 ఏళ్లు, 4వ తరగతి,
డీఏవీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్.
కథనం: ప్రాణాపాయంలో ఉన్న స్పైడర్ బాయ్
సమయానికి 108 అంబులెన్‌‌స వచ్చి బతుకుతాడు.

మా మదర్ ఫోన్ తీసుకుని సినిమాల్లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌ని షూట్ చెయ్యటం ట్రై చేస్తున్నాను. ఆ టెక్నిక్ నేను కనుక్కుని షూట్ చేసి మా డాడీకి చెప్పాను. అప్పుడు ఆయన షార్ట్ ఫిలిం తియ్యమని సజెస్ట్ చేశారు. ఆ తర్వాత టీవీలో స్పైడర్ మ్యాన్ చూసి అందులో సాంగ్‌తో షార్ట్‌ఫిలిం ఆలోచన వచ్చింది. మా తాతయ్య స్పైడర్ బాయ్ బొమ్మ కొనిచ్చారు. మొబైల్ కెమెరాతో దీన్ని షూట్ చేశాను. సినిమా కథ ఏంటంటే... స్పైడర్ బాయ్ తన శక్తితో ఎగురుతూ ఉంటాడు. మధ్యలో శక్తి కోల్పోతాడు. అప్పుడు 108 అంబులెన్స్ రావటంతో స్పైడర్ బాయ్ ప్రాణాలు నిలుస్తాయి. ఈ ఫిలిం మేకింగ్‌కి కజిన్.. అని, అమ్మ, నాన్నతో పాటు ఆయన ఫ్రెండ్స్ చిక్కాల, నవీన్ హెల్ప్ చేశారు. మానాన్న ప్రసాద్ అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. తరువాతి షార్ట్ ఫిలింకి నేనే మ్యూజిక్ చేయాలనుకుంటున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top