సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 1. 'మాల'

చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. వీటిలో అత్యధిక భాగం చక్కని సందేశాలతో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయాలతో నిండి ఉండడం ఎంతైనా అభినందనీయం. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది.

మాల

డైరెక్టర్: విజయ్‌కుమార్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ.
కథనం: సర్కస్ ఫీట్స్ చేసి జీవించే
కుటుంబంలోని ఓ చిన్నారి వ్యథ.

ఓ మారుమూల బస్తీలో తాడు మీద నడుస్తూ సర్కస్‌ఫీట్స్ చేస్తూ జీవించే కుటుంబంలో చిన్నారి వ్యథకు ఇది చిరు తెర రూపం. చదువుకోవాలనే ఆమె ఆశకు ఆర్థిక సమస్యలతో పాటు చిట్టి భుజాల మీద సంపాదన బాధ్యత కూడా తోడవుతుంది. ఆమె తండ్రికి ఈ చిన్నారి మీద ఆప్యాయత, ప్రేమ ఉన్నా... తాగుడు వ్యసనం. ఆ చిన్నారి తన ఫాదర్‌ని ఎలా మార్చింది? తనెలా చదువుకోవాలనే కలను సాకారం చేసుకుంది అనేది సినిమా కథ. మొత్తం 15 నిమిషాల నిడివి ఉండే ఈ బుల్లి చిత్రాన్ని ఇంగ్లండ్‌లో కమ్యూనిటీ చానల్ వాళ్లు టెలికాస్ట్ చేశారు. చందానగర్‌లోని విబ్‌గ్యార్ ఇంగ్లిష్ మీడియం స్కూలు పిల్లలే పాత్రధారులుగా యాక్ట్ చేసిన ఈ సినిమా రూపకర్త ఆ స్కూల్‌లో ఇంగ్లిష్ ఫ్యాకల్టీ విజయ్‌కుమార్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top