సాక్షి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ : 2. 'జస్విక'

చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. వీటిలో అత్యధిక భాగం చక్కని సందేశాలతో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయాలతో నిండి ఉండడం ఎంతైనా అభినందనీయం. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది.

జస్విక
కథ
దర్శకత్వం: రాజా , ఎడిటింగ్: ఉషామాధవి
కథనం: చాకోబార్ కోసం డబ్బు కూడబెట్టి కొనుక్కున్న జస్విక కథ ఇది
జస్విక ఓ నాలుగేళ్ల చిన్నారి. ముద్దులొలికే ఆ చిన్నారికి చాకోబార్ తినాలని ఉంటుంది. అమ్మానాన్నలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోరు. కిట్టీ బ్యాంక్‌లో ఉన్న రెండు రూపాయలు తీసుకుని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్తుంది. చాకోబార్ రేట్ రూ.20 అని తెలుసుకుని బుంగమూతితో ఇంటికి చేరుతుంది. ఇదే విషయాన్ని అక్వేరియంలో ఉన్న బుల్లి చేపపిల్లతో చెప్పుకుంటుంది జస్విక. ఎలాగైనా రూ.20 కూడబెట్టాలని డిసైడ్ అవుతుంది. రోజూ రెండు రూపాయల చొప్పున పొదుపు చేస్తుంటుంది.

ప్రతి రోజూ కిట్టీ బ్యాంక్‌లో డబ్బులు వేసి ఆ విషయం చేపపిల్లతో చెప్తుంటుంది. పది రోజుల తర్వాత రూ.20 తీసుకెళ్లి చాకోబార్ తెచ్చుకుంటుంది. ఎవరి కంటా పడకుండా బాల్కనీలో తినాలని ప్లాన్ చేస్తుంది. వాళ్లమ్మ పిలవడంతో ఇంట్లోకి వెళ్తుంది. తీరా వచ్చేసరికి చాకోబార్ కాస్తా కరిగిపోతుంది. అది చూసి జస్విక ఏడుపు అందుకుంటుంది. ఆ చిన్నారి బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు.. సాయంత్రం ఓ చాకోబార్ కొనివ్వడంతో కథ ముగుస్తుంది. జస్విక పాత్రలో చిన్నారి జస్విక అదరగొట్టింది. ఓ చిన్నారి అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకుడు జస్విక తండ్రి రాజా అయితే, తల్లి ఉషామాధవి ఎడిటింగ్ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top