రాంచరణ్ 'ధృవ' టీజర్ విడుదల

'బ్రూస్ లీ' లాంటి అట్టర్ ప్లాప్ తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ చేస్తున్న సినిమా'ధృవ'. దసరా పర్వదినం సందర్భంగా మంగళవారం ఆ సినిమా టీజర్ ను విడుదలచేశారు. 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నా..' అంటూ రాంచరణ గంభీరంగా చెప్పే డైలాగ్స్ ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతున్నట్లున్నాయి. ఐపీయస్ ట్రైనింగ్ పూర్తికాక ముందే డ్యూటీ స్టార్ట్ చేసే యంగ్ ఆఫీసర్.. శత్రువుతో ఆడే మైండ్ గేమ్ 'ధృవ'లో ప్రధానాంశం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top