ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క'
ప్రపంచాన్ని పిచ్చెత్తిస్తున్న పోకేమాన్ గో గేమ్.. ఇప్పుడు సాధారణ పౌరుల్నే కాదు సెలబ్రిటీలను వదలడం లేదు. ఇటీవలే పోకేమాన్ గో గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పోకేమాన్ గో గేమ్ కు ఫిదా అయిపోయింది. బయటకు వెళ్ళి పోకేమాన్ లను వెతికి పట్టుకోవడంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తోందని, ఈ గేమ్ తనకు ఎంతో ఇష్టంగా ఉందని అంటోంది. నిజంగానే జంతువులను వేటాడేందుకు వెళ్ళిన వేటగాడిలా పోకేమాన్ లను వెతుక్కుంటూ వెళ్ళడం వాటిని వేటాడి పట్టడం ఎంతో అద్భుతంగా ఉందంటోంది. ఇటీవల సుల్తాన్ సినిమాలో తనదైన పాత్రతో అభిమానులకు మరింత చేరువైన అనుష్కా.. సినిమా షూటింగ్ లు, డైలీ రొటీన్ లైఫ్ కు భిన్నంగా పోకేమాన్ గో ఆడుకుంటూ సరదాగా టైమ్ పాస్ చేయాలని సంబరపడిపోతోంది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు