30వేల ఉద్యోగులపై ఆ కంపెనీ వేటు!

యూరప్లో అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న జర్మన్ కార్మేకర్ ఫోక్స్వాగన్ 30 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు ధృవీకరించింది. కర్బన్ ఉద్గారాల స్కాంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఈ కంపెనీ, ఆ నష్టాల నుంచి బయటపడటానికి 2021లోపు 30వేల ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపింది. ఫోక్స్వాగన్, ఆ దేశ లేబర్ యూనియన్లు ఈ విషయాన్ని అంగీకరించాయి. తన ఫోక్స్వాగన్ బ్రాండును లాభాల బాటలో నడిపించడానికి, ఎలక్ట్రిక్, స్వీయనియంత్రణ కార్ల వైపు తమ వ్యాపారాలను మరల్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కర్బన ఉద్గారాల స్కాం అనంతరం కంపెనీ పడరాని పాట్లు పడింది. పలు దేశాల్లో ఈ కంపెనీకి భారీ నష్టపరిహారాలే ఎదురయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top