ఆ రెండు దేశాల తీరే వేరు

ఆ రెండు దేశాల తీరే వేరు - Sakshi


అవలోకనం

కాఠ్మండులో రెండు వేపులా రెండేసి రోడ్లున్న ఇరుకు రహదారుల్లో సైతం ట్రాఫిక్‌ పూర్తిగా క్రమబద్ధమైన  వరుసల్లోనే సాగుతుంది. నేరుగా పోయేవారు పక్క వరుస పూర్తిగా ఖాళీగానే ఉన్నా దానిలోకి పోక కుడి పక్క వరుసలోనే ఉంటారు. ఇది భారత్‌లోనే కాదు, శ్రీలంక తప్ప మరే దక్షిణ ఆసియా దేశంలోనూ జరిగేది కాదు. శ్రీలంకకు వెళ్లిన భారత సందర్శకులెవరికైనా అక్కడ మన దేశంలోలా మురికి, గందరగోళం, అస్తవ్యస్తత లేకపోవడమూ, అక్కడి రోడ్లు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా, నాగరికంగా ఉండటమూ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తాయి.



కొన్ని రోజుల క్రితం నేను నేపాల్‌ వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన అంశాన్ని గమనించాను. ఉపఖండంలోని ఇతర అన్ని నగరాల్లాగేS కాఠ్మండు కూడా ఒక నగరం. ప్రజలలో అత్యధికులు సంపన్నులేమీ కారు. ఇళ్లు చాలా వరకు ఓ మోస్తరువే. కానీ రోడ్ల మీద వాహనాల రద్దీ మాత్రం మౌలిక సదుపాయాలు తట్టుకోలేనంత ఎక్కువగా ఉంది. ఎందువల్లనో గానీ చాలా రోడ్ల కూడళ్లలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పని చేయడం లేదు. దీంతో ట్రాఫిక్‌ను నిర్దేశించడానికి పోలీసులు అవసరమవుతున్నారు. మన ఉపఖండంలో ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలు కనిపిం చేవే. ట్రాఫిక్‌ రద్దీ బాగా ఎక్కువగా ఉన్నా దాదాపుగా ఎక్కడా కర్ణకఠోరమైన హార న్‌ల మోతలు వినబడలేదు. 20 ఏళ్ల తర్వాత నేను కాఠ్మండుకు వెళ్లాను. కాబట్టి అది ఎప్పుడూ ఇలాగే ఉందో ఏమో నాకు లె లీదు. ఒక స్థానికుడ్ని అదే అడిగితే, వారం క్రితమే హారన్‌లు మోగించరాదనే చట్టం లేదా ఆదేశం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఆ మాత్రానికే ప్రజలు దాన్ని పాటిస్తూ నడుచుకుంటారంటే నాకు నమ్మశక్యం కాలేదు. కానీ నాకు, అవును అనే సమాధానమే వచ్చింది. పోలీసులు లంచాలు తీసుకోరనేది కనబడుతూనే ఉంది. ఇదెంత అసాధారణమైన సంగతి!



రెండు వేపులా రెండేసి రోడ్లున్న (అవి ఇరుకైనవైనా) రహదారుల్లో సైతం ట్రాఫిక్‌ పూర్తిగా క్రమబద్ధమైన  వరుసల్లోనే సాగుతుండటం అక్కడ నేను గమ నించిన మరో అసాధారణ విషయం. ట్రాఫిక్‌ బాగా రద్దీగా ఉన్నా గానీ నేరుగా పోయేవారు... పక్క వరుస పూర్తిగా ఖాళీగానే ఉన్నా దానిలోకి పోకుండా కుడి పక్క వరుసలోనే ఉంటున్నారు. ఇది భారత్‌లోగానీ లేదా ఒక్క దేశం మినహా మరే దక్షిణ ఆసియా దేశంలోగానీ ఎన్నటికీ జరగదు. ఆ మరో దేశం గురించి తర్వాత ముచ్చటిద్దాం గానీ, ఇప్పటికైతే నేపాల్‌ గురించి చెప్పనివ్వండి.



నేపాల్‌లో కొన్ని మనోహరమైన, చాలా పెద్ద దేవాలయాలున్నాయి. వాటిలో కెల్లా కాఠ్మండులోని శివుని పశుపతినాథ దేవాలయం అత్యంత గొప్పది. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న లోహపు నంది అద్భుతమైనది, చాలా భారీది. అదెంత మహ త్తరంగా కనిపిస్తుందో చూడటానికి ఇంటర్నెట్‌ను శోధించండి. ఆ ఆలయంలో అర్చకులుగా ఉండేది కేరళ నంబూద్రి బ్రాహ్మణులే. అది సుదీర్ఘకాలంగా అక్కడ అమల్లో ఉన్న సంప్రదాయం. వారి స్థానంలో స్థానిక బ్రాహ్మణులను నియమిం చాలని మావోయిస్టులు అనుకున్నారు. కానీ అదింకా జరగలేదు.



ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలోనే దున్నపోతులు సహా జంతువులను బలి ఇవ్వడం ఈ దేవాలయపు మరో ప్రత్యేకత.  భారత్‌లోని ఏ ప్రధాన దేవాలయం లోనూ అలాంటి దృశ్యం కనబడటం అసాధ్యం కాకున్నా కష్టం. రచయిత నీరజ్‌ సీ చౌధురి స్వీయ జీవిత చరిత్రలో తన చిన్నతనంలో బెంగాల్‌లో ఒక దున్నపోతును బలి ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప భారత్‌లో దాదా పుగా ఆ సంప్రదాయం మటుమాయమైంది. నేడు అలాంటి పని చెయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే జనాలు చావ చిదగ్గొట్టేస్తారు. నేపాల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.



నేపాలీ బౌద్ధం సజీవ మతంగా నిలిచి ఉండటం మతపరమైన మరో భిన్నాంశం. నేపాలీలకు వజ్రయానమనే తన సొంత బౌద్ధ శాఖ ఉన్నది. భారత దేశంలోని మరే మతంలోనూ కనిపించని అత్యంత సున్నితత్వం అందులో ఉంది. మన దేశంలో బౌద్ధం చాలావరకు పురావస్తు ప్రాంతాలకే పరిమితం. పలువురు దళితులు స్వీకరించిన నవయాన బౌద్ధం అనే కొత్త శాఖ కూడా ఉంది. కానీ బౌద్ధం ఇక్కడ అంత ప్రముఖంగా లేదు.



మరి నేపాల్‌ సంస్కృతిలో బౌద్ధం అంత ప్రాబల్యాన్ని ఎలా కలిగి ఉన్నది? సమాధానం నాకు తెలిసి ఉంటే బాగుండేది. బుద్ధుడు జన్మించిన లుంబిని నేపాల్‌ లోనే ఉంది. నేపాల్‌ సరిహద్దుల్లోని ఉత్తరప్రదేశ్‌లోనే బుద్ధుడు జన్మించాడని ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కొంత కాలం క్రితం ప్రకటించింది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. టిబెట్‌ బౌద్ధ సంప్రదాయం సైతం కాఠ్మండులో ఉంది. ఆ సంప్రదాయానికి చెందిన పలు అద్భుత ఆలయాల్లో స్వయంభూతనాథ ఆలయం ఒకటి. ఆ ఆలయ సందర్శకులలో హిందువులు, బౌద్ధులు అనే విభజన ఉండదు. ఇరు మతాల అనుయాయులూ అక్కడికి వస్తుంటారు. భారత్‌లో హిందువులు, ముస్లింలు కలగలసి సందర్శించే అజ్మీర్, నిజాముద్దీన్‌ వంటి స్థలా లను అది నాకు గుర్తుకుతెచ్చింది.

దక్షిణాసియా దేశాల్లో మిగతా వాటికి భిన్నమైన మరో దేశం గురించి ఇంతకు ముందు ప్రస్తావించాను. అది శ్రీలంక. అది బౌద్ధ దేశం. అయితే అక్కడి బౌద్ధ మతం తీరవాద లేదా హీనయాన శాఖ నుంచి వచ్చినది.



మాక్స్‌ ముల్లర్‌ తీరవాద గ్రంథాలను పాలీ భాష నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు కాబట్టి ఆ విషయం నాకు తెలిసింది. శ్రీలంకకు వెళ్లిన భారత సందర్శకులెవరికైనా అక్కడ వెంటనే కొట్టవచ్చినట్టుగా కనిపించేది... మన దేశంలోలా మురికి, గందరగోళం, అస్త వ్యస్తత లేకపోవడం. అక్కడి రోడ్లు, నివాస ప్రాంతాలు మరింత పరిశుభ్రంగా, ఎక్కువ నాగరికంగా ఉంటాయి. అదెందుకో నాకు తెలియదుగానీ అక్కడి ప్రజలు కూడా ఒక విధంగా భిన్నంగానే కనిపిస్తారు. ఈ తేడా ఆవశ్యకంగా మతం వల్ల వచ్చేదేనా? ఒక శతాబ్దం క్రితం జనాభాలో దాదాపు ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులు గానే ఉండిన ఆ ప్రాంతంలో మతం ప్రజలకు తమ సంస్కృతిని గురించి తెలియ జేసే అత్యంత శక్తివంతమైన మార్గమైంది.



అంతకు మించి ఈరోజు ఈ విషయంపై మరింతగా ఊహాగానం సాగిం చాలనుకోవడం లేదు. కాకపోతే మనకూ, నేపాలీలు, లంకేయులకు మధ్య గమ నించదగిన తేడా ఉన్నదనే విషయాన్ని గుర్తించడానికి నేను పరిమితమవుతాను. ఇది ఆ తేడా ఎక్కడి నుంచి వస్తున్నదో అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది. ఆ తేడా ఏదో ఒక విధంగా మెరుగైనదయితే దాన్ని మనం అందుకోవడం ఎలా అనే దాన్ని అవగతం చేసుకోడానికి దోహదపడుతుంది.



ఆకార్‌ పటేల్‌

aakar.patel@icloud.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top