చికాగోలో టీఏజీసీ సమ్మర్ సంబరాలు






చికాగో మహానగర తెలుగు సంస్థ (టీఏజీసీ) వేసవి కాలాన్ని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికి వన భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ సంబరాలు చికాగో శివార్లు ఎల్క్ గ్రోవ్ లోని బస్సేవూడ్స్ ఫారెస్ట్ ప్రిజర్వ్ లో ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా జరిగే ఈ వన భోజనాలకు ఈ ఏడాది 950కి పైగా సభ్యులు, ఇతర అతిథులు హాజరయ్యారు. టీఏజీసీ (TAGC) కార్యవర్గ సభ్యులు అందరికీ భోజనం వడ్డించారు. గ్రిల్డ్ చికెన్, దోసెలు వన భోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యాహ్న భోజనం తరవాత అందరూ పుచ్చకాయ తిని, మజ్జిగ తాగి సేదతీరారు.



వన భోజనాలు అద్భుతంగా నిర్వహించినందుకు పిక్నిక్ కోర్ కమిటీ సభ్యులను టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే అభినందించారు. రాము బిల్లకంటి, రంగారెడ్డి లంకల, ఉమా అవధూత, విజయ్ బీరం, వాణి ఏట్రింతల, సంపత్ సంగేమ్, సాయి గొంగాటీలు వాలంటీర్స్ ను అభినందించారు. అందరినీ అలరించేందుకు  ఎన్నో ఆట విడుపు కోసం మెన్స్, ఉమెన్స్, కిడ్స్ విభాగాలుగా ఎన్నో ఆటల పోటీలను నిర్వహించింది.  మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, టగ్ అఫ్ వార్ ఆటలు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గెలిచిన వారికి బహుమతులు అందజేసింది.





టీఏజీసీ నిర్వహించే స్వచ్చంద సేవా కార్యక్రమాలకు ఫండ్ రైసింగ్ కు గాను రెండు మైళ్ళ నడక పోటీని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను అక్షయ విద్య ఫౌండేషన్ కు అందజేసింది. ఈ వన భోజనాల్లో భాగంగా వంటల పోటీలను నిర్వహించారు. నోరూరించే వంటలతో పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసింది.



తెలంగాణ సకినాలకు మొదటి బహుమతి, రవ్వ లడ్డులకు రెండవ బహుమతులను అందచేశారు. టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి  ఏడే ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ఈవెంట్ ను విజయవంతం చేసినందుకు కార్యవర్గ సభ్యులకు, స్పాన్సర్స్, వాలంటీర్లు సహా వచ్చిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.











Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top