మగ వేధింపులకు ముకుతాడు

మగ వేధింపులకు ముకుతాడు


సందర్భం

‘‘మనమందరం ఒక తల్లికి పుట్టిన వాళ్లమే. మనం కూడా ఒక అక్క, చెల్లి, బిడ్డ కలిగి ఉన్నవారమే’’ అంటూ కేసీఆర్‌ చెప్పిన మాట ప్రకారం బాధ్యతగా వ్యవహరించవలసి  ఉంది. స్త్రీని చూసే మైండ్‌సెట్‌నే ఈ సమాజం సమూలంగా మార్చుకోవల్సి ఉంది.



‘‘మహిళల భద్రత కోసం సిటీలో షీటీమ్స్‌ పనిచేస్తా ఉన్నాయి. మహి ళల గౌరవాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉన్నది అధ్యక్షా! మనం దరం ఒక తల్లికి పుట్టిన వాళ్లమే. మనం కూడా ఒక అక్క, చెల్లి, బిడ్డను కలిగి ఉన్నవాళ్లమే. కాబట్టి, మహిళలకు సమాజంలో రక్షణ ఉండాలి. దానికోసం హైదరాబా ద్‌లో మెుత్తం సీసీ కెమెరాలు పెడ్తా ఉన్నం అధ్యక్షా! కచ్చి తంగా, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మహిళలు బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా హైదరాబా ద్‌లో పోలీసుశాఖ నుంచి షీ–టీమ్స్‌ పనిచేస్తా ఉన్నయి. మంచి రిజల్ట్స్‌ వస్తా ఉన్నయి అధ్యక్షా! ఆడపిల్లల వైపు ఎవరైనా చెడు చూపుతో చూస్తే కళ్లు పీకేస్తమని కఠినంగా మాట్లాడిన అధ్యక్షా! అదే పద్ధతిలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తది. మహిళల గౌరవాన్ని కాపాడతది. రక్షణ కల్పిస్తది’’.



ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండేళ్ల క్రితం 2014, నవంబర్‌ ఆఖరు వారంలో నిండు శాసన సభలో చేసిన విస్పష్ట ప్రకటన. పోలీసు శాఖలోని షీటీమ్స్‌కి బాగా పనిచేస్తున్నా యనే ప్రశంస ఉన్నది. అందరికీ అక్క, చెల్లి, బిడ్డ ఉంటారని చెప్పిన మాటల్లో మహిళలను ఎలా చూడాలనే స్పష్టత ఉన్నది. ఆడపిల్లలకు భద్రత, రక్షణ మాత్రమే కాక, గౌరవం, ఆత్మ గౌరవం ఎంత అవసరమో చెప్పే సంస్కారం ఉన్నది. మహిళల గౌరవానికి, భద్రతకు భంగం కలిగించే ‘మగాళ్ల’ను కళ్లు పీకేస్తా మని హెచ్చరించే కాఠిన్యం ఉన్నది.



శాసనసభలో ఆ ప్రకటన చేయడానికి దాదాపు ఓ నెలరోజుల ముందు సచివాలయంలో కేసీఆర్‌ ఒక సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ‘అల్లరి మూకలు, రౌడీమూకలు ఆడపిల్లల దిక్కు చూడాలంటే ఉచ్చ పోసుకునే పరిస్థితి వస్తది. కళ్లు పీకసే కార్యక్రమం చేస్తం’ అని హెచ్చ రించారు. ఆడపిల్లలను వేధిస్తే పర్యవసానాలు ఎంత కఠి నంగా ఉంటాయో స్వయంగా సీఎం నుంచే సందేశం వెళ్లిపో యింది. షీటీమ్స్‌కి అంకుర్పారణ జరిగిన సమావేశమది. సీఎం  హెచ్చరికను పోలీసుశాఖ అంతే నిబద్ధతతో స్వీకరించింది.



ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న మగవేధింపు లపై (ఈవ్‌టీజింగ్‌) బ్రహ్మాస్త్రంలా షీటీమ్స్‌ని ఎక్కుపెట్టారు. బహిరంగ ప్రదేశాలలో ఆడపిల్లలు, మహిళలను అపరిచితులైన మగవాళ్లు వేధించడాన్నే ‘ఈవ్‌ టీజింగ్‌’ అంటున్నారు. నిర్మొ హమాటంగా చెప్పాలంటే, ఇవి కచ్చితంగా ‘లైంగిక వేధిం పులు’. వీటిని ‘ఈవ్‌ టీజింగ్‌’ అని వ్యవహరించటం అంటే, లైంగిక వేధింపుల తీవ్రతను తక్కువ చేయటమే. వాటి నేర స్వభావాన్ని సరళం చేసి చూపెట్టటమే.



1970ల దశకం తరువాత మనదేశంలో ఆడపిల్లలు చదు వుకోవడానికి బయటకు రావటం ప్రారంభించారు. కళాశా లల్లో, కార్యాలయాల్లో మహిళల ఉనికి మెరుగుపడింది. మగ వారి తోడుంటేనే బయటకు వెళ్లే మహిళలు సొంతంగానే చదు వులకు, ఉద్యోగాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ మారిన పరిస్థితు లకు అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం అభివృద్ధి చెందలేదు.  ఆడపిల్లలను, మహిళలను ఆటపట్టించటం, లైంగికంగా, అసభ్యంగా వేధించటం మెుదలుపెట్టారు. ఈ వికృత చేష్టలన్నీ ‘ప్రకోపించిన కామ వికారాలు’ తప్ప, మరొకటి కాదు.



ఇక సినిమాల్లోనయితే, కథ మెుత్తం ఈ థీమ్‌ పైనే ఆధా రపడి ఉంటుంది. పనీపాటా లేకుండా తిరుగుతూ, పరీక్షల్లో వరుసగా ఫెయిలవుతూ వస్తున్న హీరోలు, సంఘ విరుద్ధ శక్తులతో జతకట్టే హీరోలు ‘ఈవ్‌ టీజింగ్‌’తోనే హీరోయిన్‌ల చెంతకొస్తారు. వద్దన్నా, కసిరి కొట్టినా, ఇష్టం లేదని చెప్పినా వినరు. పదే పదే వెంటపడతారు. వేధిస్తారు. పాటలు పాడ తారు. ప్రముఖ హీరోలపై వీటిని చిత్రీకరించటంవల్ల ఈ వేధిం పులు ‘గ్లామరైజ్‌’ అవుతున్నాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇలా వేధింపులతో వెంటపడిన హీరోనే హీరోయిన్‌ చివరికి ప్రేమిస్తుంది. అంటే, ఈ వేధింపులను సిని మాలు ఆమోద యోగ్యం, ఆచరణ యోగ్యం చేస్తున్నాయి. ఆడ వాళ్లు ‘ఇష్టం లేదు’ అని చెప్పినా, వారి అభిప్రాయాన్ని గౌరవిం చనక్కరలేదనే సందేశం మగవాళ్ల నరనరాన పాకిపోతోంది.



దేశంలోనే మెుట్టమెుదటగా తెలంగాణలోనే మహిళల భద్రతకు, రక్షణకు షీ–టీమ్‌లు ఏర్ప డ్డాయి. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్వాతి లక్రా ఆధ్వర్యంలో షీటీమ్స్‌ మహిళలకు రక్షణ కవచంగా మారడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో సహా, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి పలు పొరుగురాష్ట్రాలు షీటీమ్స్‌ ఏర్పాటులో తెలంగాణ బాట పట్టాయి. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో 2015, ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం షీటీమ్స్‌ని ప్రారంభించింది. షీటీమ్స్‌ మఫ్టీలో తిరుగుతుండటంతో ఆకతాయిలు, అల్లరి మూకలకు ఒక రక మైన భయం ఏర్పడింది.



ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధిం పుల సమస్య కేవలం పోలీసుశాఖ తీసుకునే చర్యల ద్వారానే పరిష్కారం కాదు... కుటుంబ పరిధిలోనే బాలురకు తొలిశిక్షణ ప్రారంభం కావాలి. ఆడపిల్లలు, మగ పిల్లలు సమానమని, ఆడపిల్లలను ప్రేమగా, గౌరవంగా చూడాలని బాలురకు నేర్పించాలి. పాఠశాలలు, కళాశాలలు కౌమార వయస్కులైన బాలురకు మలి శిక్షణ అందించాలి. పాఠ్యాంశాలను కూడా మహిళల పట్ల గౌరవం కలిగే విధంగా, కుటుంబంలో, సమా జంలో మహిళల సేవల ఔన్నత్యాన్ని, విలువను తెలిపే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ బృహత్కా ర్యంలో మీడియాకు గురుతర బాధ్యత ఉంది.



సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రభావవంతంగా చెప్పిన ‘‘మన మందరం ఒక తల్లికి పుట్టిన వాళ్లమే. మనం కూడా ఒక అక్క, చెల్లి, బిడ్డను కలిగి ఉన్నవారమే’’ మాటను అందరూ మననం చేసుకుని బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. స్త్రీని చూసే మైండ్‌సెట్‌నే ఈ సమాజం సమూలంగా మార్చు కోవల్సి ఉంది.

(రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)





- గొట్టిపాటి సుజాత


వ్యాసకర్త జాయింట్‌ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఈ–మెయిల్‌ : sujata.hyderabad@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top