‘ప్రగతి భారత్‌’కు స్ఫూర్తి

‘ప్రగతి భారత్‌’కు స్ఫూర్తి - Sakshi


సందర్భం

అయిదో తరగతిలో చదువు ఆపవలసిన పరిస్థితిలో ఇంటింటికీ పేపర్‌ వేసి చదువు సాగించిన రామేశ్వరం అబ్బాయి ఏపీజే అబ్దుల్‌ కలాం.. తర్వాత క్షిపణి రూపకర్తగా, రాష్ట్రపతిగా ఎదిగారు. కోట్లాది విద్యార్థులకు స్వాప్నికుడిగా, మార్గదర్శిగా అయ్యారు.




భారతదేశపు మేలి రత్నం డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం కాలంలో కలసిపోయి అప్పుడే రెండేళ్లు అయింది. ఆయన నిజమైన సర్వ ధర్మ సమన్వయకర్త, నిత్య జీవి తంలో ధర్మాన్ని నూరుపాళ్లు పాటించి అధికారానికి– వ్యక్తిగతా నికి మధ్య నిఖార్సయిన అడ్డుగో డను నిర్మించారు. రాజకీయాలు తన చుట్టూ అలముకున్నా ఎక్కడా ఏ వివాదానికీ తావు ఇవ్వని వివాదరహిత సర్వజన సుముఖుడు కలాం.. వ్యక్తి గత సంతోషానికి వివాహం, మిద్దెలు, మేడల కోసం ఆలో చన కూడా లేకుండా నిరంతరం దేశ సేవలో తరించిన కర్మ యోగి. తన స్వప్నమైన అభివృద్ధి భారత్‌ను సాధించడానికి లీడ్‌ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమానికి రథ సారథ్యం వహించారు.


డాక్టర్‌ కలాం రెండవ వర్ధంతి సందర్భంగా 27.7.2017నాడు తన జన్మస్థానం రామేశ్వరంలో మన ప్రధాని నరేంద్ర మోదీ కలాం మ్యూజియంను ప్రారం భించి దేశానికి అంకితం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో లీడ్‌ ఇండియా ఉద్యమ నాయకులు ‘కలాం మిషన్‌ 2020’ ప్రారంభించి 12–24 సంవత్సరాల మధ్యలో ఉన్న 20 కోట్ల యువతకు ‘మీ అభివృద్ధే దేశాభివృద్ధి’ శిక్షణను ఇచ్చి కలాం ప్రబోధించిన అభివృద్ధి భారత్‌ కలలను సాకారం చేసేందుకు నాంది పలుకుతున్నారు. ఈరోజు దేశం మొత్తం వారిని  మరోమారు గుర్తు చేసుకుని వారి వారస త్వాన్ని స్వీకరించవలసిన సమయం.



దేశం మొత్తంలో 2009 ప్రాంతంలో అవినీతి కుంభ కోణాలు కోకొల్లలు వెలుగు చూశాయి. ఈ అవినీతి రక్కసి వెన్ను విరిచేందుకు అన్నా హజారే, రవిశంకర్‌ గురూజీ, రాందేవ్‌ బాబా, అరవింద్‌ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ లాంటి దేశ ప్రముఖులందరూ ఏకమై ‘భ్రష్టాచార్‌ ఆందోళన్‌’ దేశవ్యా ప్తంగా చేయించడానికి డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను అధ్యక్షు లుగా ఆహ్వానించారు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా వారు ఒప్పుకోలేదు. ‘ఇది దేశానికి చాలా అవసరం, ప్రముఖ నాయకులందరూ సంఘటిత శక్తిగా మారుతున్న చక్కని అవకాశం మీరెందుకు నాయకత్వం వహించేందుకు ఒప్పు కోవడం లేదు’ అని వారిని ఒక సందర్భంలో అడిగాను.



‘..అవినీతిని ఆపడం ఉద్యమాల ద్వారా సాధ్యం కాదు. అసలు అవినీతి జన్మస్థానం మనిషి మనసులో తన ఆలోచనలలో, మాట్లాడే మాటలలో చేసే చేష్టలలో ఉంటుంది. తనకొక న్యాయం, ఇతరులకొక న్యాయం, తన కొక చట్టం, ఇతరులకు మరొక చట్టం.. ఈ ద్వంద్వ వైఖరే అవినీతికి ముఖ్యమైన మూలాలు. ఎవరికి వారుగా గట్టి తీర్మానం చేసుకుని నీతితో జీవిస్తే కానీ అవినీతి అంతమ వదు. మీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వారిని మార్చ డానికి ఇది సరైన వయసు. మీరు చేసే ప్రయత్నానికి ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు తోడ్పడి అందరూ సమష్టిగా కృషి చేసినా వచ్చే తరంలో అవినీతి తగ్గుతుంది. అందుకే అవినీతి బురదకు దూరంగా ఉంటున్నాన’ని అన్నారు.


చాచా నెహ్రూ తర్వాత బాలల హృదయాలు జయిం చినది ఒక్క అబ్దుల్‌ కలాంగారే. వారు జీవితమంతా శాస్త్ర వేత్త అయినా ఉపాధ్యాయ ప్రవృత్తి అవకాశం దొరికి నప్పుడల్లా విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత ఆఖరి శ్వాస వరకూ బాలలకే అంకితమైన మహామనిషి.



అది 2009 సాధారణ ఎన్నికల సమయం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కేవీ రమణాచారి ఆహ్వానం మేరకు కలాం తిరుపతి వచ్చి 50 వేల మంది విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఈ సంద ర్భంలో చిత్తూరు కలెక్టర్‌ ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో లక్షమంది పిల్లలకు లీడ్‌ ఇండియా శిక్షణ ఇచ్చి ‘నోటుకు ఓటు అమ్మవద్దు’ అని పిల్లల ద్వారా ఎన్నికల్లో అవినీతిని నిరోధించేందుకు కృషి చేశాం. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ‘నోటుకు ఓటు అమ్మను’ అని సంతకం చేయించి ఒక లక్ష పోస్టు కార్డుల దండను కలాంగారి మెడలో వేశారు. ‘ ఈ పిల్లలు లంచం ఇవ్వరు, లంచం తీసుకోరు, తల్లిదండ్రులు లంచం తీసుకుంటే ప్రశ్నిస్తారు. అవినీతివల్ల దేశాభివృద్ధి ఎలా కుంటుపడుతుందో వారికి అర్థం చేయిస్తారు. అది దేశ అవినీతిని నిరోధించేందుకు లీడ్‌ ఇండియా చేస్తున్నదే సరైన ఉద్యమం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తోడై అవినీతిని ఆపాలి’ అన్నారు కలాం.



ఈ మధ్య కోయంబత్తూర్‌ లోని పల్లపట్టికి చెందిన 18 ఏళ్ల విద్యార్థి రిఫత్‌ షారూక్‌... కలాం సాట్‌ను ఆవిష్కరించి పేరుగాంచాడు. 2006 ఆగస్టు 28న కలాం వందమంది లీడ్‌ ఇండియా మార్పు ప్రతినిధులను రాష్ట్రపతి భవన్‌కు పిలిపించి మీరు ఏం అవ్వాలని కలలు కంటున్నారు అని ప్రశ్నించారు. వారిలో అంగవైకల్యం కలిగిన 9వ తరగతి విద్యార్థి బొల్లా శ్రీకాంత్‌ లేచి ‘నేను మొట్టమొదటి అంగవైకల్యం కలిగిన రాష్ట్రపతి కావాలని కలలు కంటు న్నాను’ అన్నాడు. వెంటనే కలాం ‘రండి రండి భవిష్యత్‌ రాష్ట్రపతితో నేను ఫొటో దిగాల’ని పిలిచి ఫొటో దిగి ప్రోత్స హించారు. తర్వాత చాలాసార్లు శ్రీకాంత్‌ గురించి ప్రస్తా వించి ప్రస్తుతించారు.



తర్వాత లీడ్‌ ఇండియా ప్రోత్సా హంతో ఎదిగివచ్చిన శ్రీకాంత్‌ ఈరోజు రతన్‌ టాటా మన్ననలు పొందిన యువ పారిశ్రామికవేత్త అయ్యారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 వసం తాలు నింపుకునే సమయానికి కలాం కలలు నిజమ నిపించేలా అభివృద్ధి జరిగి భారత్‌ విశ్వగురువుగా ఆవిర్భ వించబోతోంది. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ ఏకమై అభివృద్ధి భారత్‌ వైపు అడుగులేయడమనే లక్ష్య సాధనకోసం విత్తనం వేసిన కలాంకి మనందరి సలాం.

(నేడు ఏపీజే అబ్దుల్‌ కలాం రెండవ వర్ధంతి సందర్భంగా)






ప్రొ‘‘ నల్లబోయిన సుదర్శన్‌ ఆచార్య

వ్యాసకర్త ఫౌండర్‌–చైర్మన్, ‘లీడ్‌ ఇండియా 2020’ మొబైల్స్‌ : 96666 61215



 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top