పీహెచ్డీ పట్టా పొందిన త్రివిక్రమ్

పీహెచ్డీ పట్టా పొందిన త్రివిక్రమ్

ప్రవాస భారతీయుడు పాలా త్రివిక్రమకు ప్రఖ్యాత న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ బహూకరించింది. ఇటీవల యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పట్టా అందజేశారు. ఆయన గత ఏడేళ్లుగా బెక్టన్ డికిన్సన్, ఫ్రాంక్లిన్ లేక్స్ సంస్థలలో స్టాఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.



ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలలతో కలిసి అమెరికాలోని పర్సిపానీ ప్రాంతంలో నివసిస్తున్నారు. త్రివిక్రమ పేరు మీద ఇప్పటికే ఐదు పేటెంట్లు ఉండగా, మరో రెండు పేటెంట్లు పెండింగులో ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయన ఇప్పటివరకు పలు అంతర్జాతీయ సాంకేతిక సదస్సులలో ఏడు టెక్నికల్ పేపర్లు ప్రచురించారు. అమెరికాలో నాటాకు కమ్యూనిటీ కో-చైర్‌గా కూడా ఉన్నారు.







Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top