గాడ్సే వాంగ్మూలంపైనా గోప్యతా?

గాడ్సే వాంగ్మూలంపైనా గోప్యతా?


విశ్లేషణ

గాడ్సేలకు గాంధీని విమర్శించే హక్కు ఉంది, వారు ఆయనను ఎందుకు హత్య చేసారో చెబితే వినే అధికారం కూడా కోర్టులకు ఉంది. కానీ దానర్థం తమ సిద్ధాం తాన్ని వ్యతిరేకించే వారిని చంపేసే అధికారం, హక్కు వారికి ఉందని కాదు.




జాతిపిత మహాత్మాగాంధీ హత్య వివరాలు ఆర్టీఐ కింద బన్సాల్‌  కోరారు. హత్యవెనుక ఉన్న సంస్థ వివరాలు, ఆరో పణ పత్రం కాపీ, నాథూరాం గాడ్సే కోర్టు ప్రకటన కాపీలు కావాలన్నారు. ఢిల్లీ పోలీసు పీఐఓ ఈ దరఖాస్తును నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఏ ఐ)కి బదిలీ చేశారు. ఉన్న దస్తావేజులన్నీ వచ్చి చూసుకో వచ్చని అధికారులు సూచించారు. పబ్లిక్‌ రికార్డ్స్‌ యాక్ట్‌ 1993 నియమాల ప్రకారం తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, 3 రూపాయలకు పేజీ చొప్పున కాపీలు ఇస్తామన్నారు. ఆర్టీఐ కింద తనకు ప్రతులు ఇవ్వాలని కోరుతూ బన్సాల్‌ రెండో అప్పీలు చేసుకున్నారు. గాంధీ హత్య నేర నిర్ధారణ సమయంలో నాథూరాం గాడ్సే చేసిన వాంగ్మూలం పుస్తకాలుగా వచ్చాయి, వెబ్‌సైట్‌ లలో కూడా ఉంది.



ఎన్‌ఐఏ (ఆర్కైవ్‌)లో ఉన్న 11 వేలకు పైగా పేజీలలో ఆరోపణ పత్రం, నాథూరాం గాడ్సే వాంగ్మూలం కూడా ఉన్నాయని అధికారులు వివరిం చారు. ఆ దస్తావేజులు చూపడం, అందులో కొన్ని పేజీల ప్రతులు ఇవ్వడం మినహా తాము ఏ విధమైన వ్యాఖ్యా నాలు, విమర్శలు చేయలేమని ఆర్కైవ్స్‌ అధికారులు చెప్పారు. అదీ గాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జీవన్‌లాల్‌ కపూర్‌ అధ్యక్షతన ఒక న్యాయ విచా రణా సంఘం గాంధీ హత్యలో కుట్రకు సంబంధించిన కోణాన్ని వివరంగా దర్యాప్తుచేసి ఒక సమగ్రమైన నివే దిక ఇచ్చింది. ఈ నివేదిక కూడా ఇండియన్‌ లా ఇన్‌ స్టిట్యూట్‌ గ్రంథాలయంలో ఉంది. వారు ఈ నివేదికను స్కాన్‌ చేసి తమ వెబ్‌సైట్‌లో ఉంచారు కూడా.



20 ఏళ్ల కిందటి సంఘటనలకు చెందిన సమాచారా నికి సెక్షన్‌ 8 (3) కింద కేవలం ఏ, íసీ, ఐ కింద దేశ భద్రత, శాంతిసామరస్యాలు, పార్లమెంట్‌ ప్రివిలేజ్, కేబినెట్‌ పేపర్లకు చెందిన మినహాయింపులను పరిశీ లించాలి. ఈ అప్పీలులో పార్లమెంట్‌ ప్రివిలేజ్, కేబినెట్‌ పేపర్ల ప్రస్తావనగానీ లేదు. గాడ్సే వాంగ్మూలం ప్రతులు తయారుచేసి ఇవ్వడానికి ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 8 కింద అవకాశం ఉందా అనీ దీన్ని వెల్లడించడం వల్ల హిందూ ముస్లిం ఐక్యతకు భంగం వాటిల్లుతుందా అని పరిశీలిం చవలసిన అవసరం ఉంది.



గాంధీ రాజకీయాల మీద తీవ్రమైన విమర్శలు, విధానాలలో లోపాలమీద చర్చ, దేశ విభజనకు దారి తీసిన పరిణామాలలో గాంధీ పాత్ర పైన తీవ్రనిందలు, హిందువులకు హానికరంగా ముస్లింలను అనవసరంగా లాలించే విపరీత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు అధికంగా ఉండటం వల్ల ఈ గాడ్సే వాంగ్మూలం వెల్ల డించాలా వద్దా అనే సందేహం రావడం సహజం. కోర్టులో సాక్ష్య విచారణ ముగిసిన తరువాత నిందితుడికి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని సెక్షన్‌ 313 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వివరిస్తున్నది. దీన్ని వినియో గించుకుని నాథురాం వాంగ్మూలాన్ని ఇచ్చాడు. దాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. దాని ఆధారంగా పుస్త కాలు, నాటకాలు, రచనలు అనేకం  వచ్చాయి. మరాఠీ నాటకాలు విపరీతంగా ప్రదర్శితమైనాయి.



నాథూరాం గాడ్సే సోదరుడు సహనిందితుడు అయిన గోపాల్‌ గాడ్సే జైలుశిక్ష అనుభవించి విడుదలైన తరువాత ‘గాంధీ హత్యా నేనూ’ పేరుతో ఒక పుస్తకం మరాఠీలో రచించి విడుదల చేశారు. ఈ పుస్తకాలు విస్తరిస్తే హిందూ ముస్లింల మధ్య శత్రుత్వాలు పెరుగుతాయని, కనుక ఈ పుస్తకం ప్రతులన్నీ స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సీఆర్‌పీసీ సెక్షన్‌ 99 ఎ కింద డిసెంబర్‌ 6, 1967న ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధతను గోపాల్‌ గాడ్సే బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. న్యాయమూర్తులు మోదీ, వి దేశాయ్, చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పుస్తకాన్ని మరాఠీ నుంచి ఆంగ్లంలోకి అనువదింపచేసి, గాడ్సే వాక్‌స్వాతంత్య్రానికి భంగక రంగా వ్యవహరించకూడదని పుస్తకం స్వాధీన ఉత్తర్వు లను రద్దుచేస్తూ తీర్పుచెప్పింది. పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వేచ్ఛలను గుర్తించిన ఆర్టికల్‌ 19(1)(ఎ)లో సమాచార హక్కు ఉందని, ఆర్టికల్‌ 19 (2)లో పేర్కొన్న సమంజస పరిమితులతో సమన్వయంగా సమాచార స్వేచ్ఛపైన కూడా పరిమితులు ఉంటాయని కోర్టులు తీర్పులు ఇచ్చాయి.



నాథూరాం గాడ్సే వాంగ్మూలాన్ని చేర్చి, గోపాల్‌ గాడ్సే రాసిన పుస్తకం ఇంకా తీవ్రమైన విమ ర్శలు ఉన్నా ఆ పుస్తకాన్ని స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు చెల్లవని ప్రకటించినప్పుడు గాడ్సే ప్రకటన ప్రతిని ఇవ్వ డానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. గాడ్సే ప్రకటన వెల్లడి చేసినంత మాత్రాన లేదా నిషేధాన్ని వ్యతిరేకించినంత మాత్రాన ఆ అభిప్రాయాలతో ఏకీభ వించినట్టు కాదని బొంబాయ్‌ హైకోర్టు వివరించింది. గాడ్సేలకు గాంధీని విమర్శించే హక్కు ఉంది, వారు ఎందుకు హత్యచేశారో చెప్పదలిస్తే వినే అధికారం కూడా కోర్టులకు, ప్రజలకు ఉంది. కానీ దానర్థం తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని చంపేసే అధికారం, హక్కు ఉందని కాదు. కనుక గాడ్సే ప్రకటన ప్రతులను పేజీకి రెండు రూపాయల కన్నా ఎక్కువ కాకుండా ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. (ఎ బన్సాల్‌ వర్సెస్‌ ఎన్‌ఏఐ ఇఐఇ/Sఏ /అ/2015/900266–అ కేసులో 16.2.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా)






(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com )

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top